రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో రీసెంట్గానే ఒక సినిమా ప్రకటన జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈరోజు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పుట్టినరోజు కావడంతో తమ దర్శకుడికి, కెప్టెన్ ఆఫ్ ది షిప్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ VD 12 చిత్రబృందం స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.
సోషల్ మీడియా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని, రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారని తెలుస్తుంది. మరి, ఇందుకు సంబంధించిన అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa