పలు సినిమాలలో కమెడియన్ గా నటించి, ఆపై జబర్దస్త్ ద్వారా స్టార్డం సంపాదించి, తాజాగా దర్శకుడిగా మారిన నటుడు వేణు టిల్లు. ఆయన ఐదేళ్ల కష్టమే "బలగం" చిత్రం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి, తెలంగాణా సంస్కృతీసంప్రదాయాలు, ఆచార వ్యవహారాల నేపథ్యంలో, అచ్చ తెలుగు పల్లెటూరి వాతావరణం చుట్టూ తిరిగే ఈ ఫన్ అండ్ ఎమోషనల్ విలేజ్ డ్రామాకు స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరి, ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa