పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఔటండౌట్ యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్న చిత్రం "సలార్". ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుక్ మై షో ఆన్లైన్ టికెట్ పోర్టల్ లో సలార్ మూవీని చూసేందుకు ఆసక్తిని వ్యక్తపరుస్తూ 100కే మెంబర్స్ ఓటేశారు. విడుదలకు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా కూడా సలార్ పై క్రేజ్ ను అభిమానులు ఈ రకంగా చూపిస్తూ, సినిమా కోసం తామెంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలియచేస్తున్నారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa