శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా నటించిన సినిమా ‘ది లెజెండ్’. ఈ సినిమాకి జేడి - జెర్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా 2022 జూలై 28న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'హాట్ స్టార్' లో ఈ సినిమా ఈనెల 3న నుండి స్ట్రీమింగ్ కానుంది.