ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. యండమూరి వీరేంద్రనాథ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఆయన కారులో వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యండమూరి, ఆయన డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి యండమూరి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.