ఈ నెల 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతున్న విషయం తెలిసిందే. తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఆస్కార్స్ ప్రెజెంటర్ గా హాజరవ్వమని ఇండియా నుండి బాలీవుడ్ అందం దీపికా పదుకొణెకు అకాడెమి నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని స్వయంగా దీపికా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది, దీపికా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
పోతే, ఆస్కార్స్ బరిలో మన ఇండియా నుండి గ్లోబల్ సెన్సేషన్ RRR లోని నాటు నాటు పాట ఉందన్న విషయం తెలిసిందే.