ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గతేడాదిలోనే జరిగింది.
ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలో వరుణ్ కి జోడిగా నటించబోయే హీరోయిన్ పై తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. 2017 ప్రపంచసుందరి మానుషీ చిల్లర్ వరుణ్ కి జోడిగా నటించబోతుందని పేర్కొంటూ కాసేపటి క్రితమే మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మేరకు గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
రినైసాన్స్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమయ్యింది.