కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా, దర్శకుడు మడోన్నె అశ్విన్ తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "మావీరన్ /మహావీరుడు". ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. గానా గానా అని సాగే ఈ పవర్ఫుల్ హై ఎనర్జిటిక్ గ్రూప్ సాంగ్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదల అయ్యింది.
అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, సరితా కీ రోల్స్ లో నటిస్తున్నారు.భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు.