యంగ్ హీరో శ్రీసింహా, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా దర్శకుడు ఫణిదీప్ రూపొందిస్తున్న చిత్రం "ఉస్తాద్". రీసెంట్గానే శ్రీసింహాను ప్రేక్షకులకు పరిచయం చేసిన మేకర్స్ తాజాగా హీరో తల్లి, గాయత్రిని పరిచయం చేస్తూ కాసేపటి క్రితమే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సాంకేతిక ప్రపంచంలో స్వతంత్రభావాలు గల మహిళగా, సింగిల్ మదర్ గా కోలీవుడ్ నటి అను హాసన్ గాయత్రి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.