తమిళనాడులో పేరొందిన వ్యాపారవేత్త, న్యూ శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా నటించిన చిత్రం "ది లెజెండ్". JD జెర్రీ డైరెక్షన్లో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో, బాలీవుడ్ హీరోయిన్ తో, స్టార్ యాక్టర్స్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు ఎనిమిది నెలలకు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.
ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుంది. థియేటర్లలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఈ సినిమా డిజిటల్ రంగంలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలని అంతటా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతమందించారు. ప్రభు, సుమన్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. ముంబై బ్యూటీ ఊర్వశి రౌతెలా హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ కమెడియన్ వివేక్ ఆఖరిసారిగా నటించిన చిత్రమిదే.