మ్యాచో స్టార్ గోపీచంద్ గతేడాది పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఐతే, ఆ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి, ఈ ఏడాది రామబాణం తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న గోపీచంద్ తాజాగా తన నెక్స్ట్ మూవీని ఎనౌన్స్ చేసారు.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 14 గా, దర్శకుడు A. హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ఔటండౌట్ కమర్షియల్ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం ఈ రోజు ఉదయమే జరిగింది. ఈ సినిమా గోపీచంద్ కి 31వ సినిమా.
ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. KR రాధామోహన్ నిర్మిస్తున్నారు. జె స్వామి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.