బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భోలా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ కైతీకి అధికారక రీమేక్. ఈ చిత్రం మార్చి 30న IMAX 3D ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క అధికారిక ట్రైలర్ 2023 మార్చి 6న విడుదలవుతుందని నటుడు అధికారికంగా ప్రకటించారు. ఈ యాక్షన్ డ్రామాలో టబు, అమలా పాల్, దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు మరియు వినీ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టి-సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ బిగ్గీని నిర్మిస్తున్నాయి.