రియల్ టైం సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'గేమ్ ఆన్' టీజర్ రీసెంట్గానే విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ప్రేమ, మోసం, సైకాలజిల్, ఎమోషనల్ గా సాగే గేమ్ లో విజయం కోసం హీరో చేసే పోరాటం ఆసక్తికరంగా సాగడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
పోతే, తాజాగా గేమ్ ఆన్ చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ మేరకు మార్చి 6న రిచో రిచ్ అనే ర్యాప్ సాంగ్ యొక్క ప్రోమోను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమాను దయానంద్ డైరెక్ట్ చేసారు. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్ సంగీతం అందిస్తున్నారు.