పాపులర్ పాప్ సింగర్, నటి స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డిజిటల్ టాక్ షో "నిజం విత్ స్మిత". ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్ లో ఈ ఏడాది కొత్తగా ఆరంభమయ్యింది. ఇప్పటివరకు మూడు సక్సెస్ఫుల్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కి రాగా, తాజాగా నాల్గవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఎపిసోడ్ కి బ్యాడ్మింటన్ కోచ్, ప్లేయర్ పుల్లెల గోపీచంద్, నటుడు, ప్యాషనేట్ ప్లేయర్ సుధీర్ బాబు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ అంశం 'స్పోర్ట్స్ అండ్ బియాండ్' పై ఇద్దరూ సవివరంగా మాట్లాడారు.