ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బలగం' మూవీకి హార్ట్ వార్మింగ్ రెస్పాన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 06:04 PM

ఈ రోజు విడుదలైన సినిమాలలో 'బలగం' ఒకటి. జబర్దస్త్ ఆర్టిస్ట్, కమెడియన్ వేణు తొలిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలను అందుకుంటుంది. సెలెబ్రెటీలకు వేసిన స్పెషల్ ప్రీమియర్స్ లో ఐతే, ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. గ్రామీణ తెలంగాణా ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను, ముఖ్యంగా మానవతా విలువలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారని కొనియాడుతున్నారు.


ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com