వంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న నటీనటుల లుక్స్‌తో పాటు ఈ సినిమా టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మహానేత వైయస్ పాత్రలో మమ్ముట్టి అతినట్టు సరిపోయారు. మమ్ముట్టి ఈ క్యారెక్టర్ చేయడంతో ‘యాత్ర’ మూవీపై ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ పెరిగింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరు మీదున్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన వారం రోజులకు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా కూడా విడుదల అవుతుండంతో ‘యాత్ర’ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ #YatraYSRBranding పేరుతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. వైయస్ బొమ్మతో ఉన్న టీ షర్ట్స్ ధరించి ఈ సినిమా ప్రమోషన్ చేస్తూ కామన్ ఆడియన్స్‌కు ఈ సినిమా చూసేలా ఆకట్టుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa