డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు. పూరీ స్టైల్లో పక్కా యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ కు జోడిగా ఇస్మార్ట్ గర్ల్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అఫీషియల్‌గా కన్ఫామ్ చేసింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘Mr.మజ్ను’లో అఖిల్ సరసన మెరిసింది. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో రన్ అవుతోంది. మొత్తానికి సరైన బ్రేక్ కోసం చూస్తోన్న నిధి అగర్వాల్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతోనైనా కథానాయికగా బ్రేక్ లభిస్తుందా లేదా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa