వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం "సార్/ వాతి". అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఇటు మాస్ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తున్న ఈ మూవీ విడుదలై రెండు వారాలు కావొస్తున్నా కూడా హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకోవడం విశేషం. ఇక్కడే కాదు.. ఓవర్సీస్ లోనూ సార్/వాతి కి చాలా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. తాజాగా USA లో 413కే డాలర్ మార్క్ కి సార్ /వాతి వసూళ్లు చేరుకున్నాయి. మరి, ధనుష్ కెరీర్ లో ఇప్పటివరకు లేని హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ఈ సినిమా తో అందుకోవాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa