ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT భాగస్వామిని లాక్ చేసిన 'మామ మశ్చీంద్ర'

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 06:40 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ని హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'మామా మశీంద్ర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆహా వీడియో ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై ప్రొడక్షన్ నెం 5గా నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa