కొంతసేపటి క్రితమే 'అన్ని మంచి శకునములే' టీజర్ విడుదలయ్యింది. బీవీ నందినిరెడ్డి దర్శకత్వంలో, సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ.. టీజర్ లోనే రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ రివీల్ చేసారు.
ఇక, టీజర్ విషయానికొస్తే, టైటిల్ లో ఉన్న పాజిటివ్ వైబ్స్, టీజర్ లో బిట్ టు బిట్ కూడా ఉంటాయి. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీ .. తో టీజర్ చూసే ప్రేక్షకుల్లో ఒక మంచి ఫీలింగ్ కలిగించడమైతే ఖచ్చితం.
నరేష్, గౌతమి, రావురమేష్, షావుకారు జానకి, వాసుకి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. స్వప్న సినిమాస్, మిత్రవింద మూవీస్ సంయుక్త బ్యానర్ లపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
![]() |
![]() |