NS పొన్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు గౌతమ్ కార్తీక్ నటిస్తున్న 'ఆగష్టు 16, 1947' మూవీ విడుదల తేదీని మూవీ మేకర్స్ ఈరోజు ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఈ పీరియాడికల్ డ్రామాలో రేవతి, రిచర్డ్ ఆష్టన్, రాబర్ట్, పుగాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్‌తో పాటు ఓం ప్రకాష్ భట్ మరియు నర్సిరామ్ చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.