కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి చిత్రం "బలగం". నిన్న విడుదలైన ఈ సినిమాకు చూసిన ప్రతి ఒక్కరి నుండి యూనానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విడుదలకు ముందే పెట్టుబడిని తీసుకొచ్చేసిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. మేకర్స్ ఎనౌన్స్ చేసిన ప్రకారం, మొదటి రోజుకు రెట్టింపుగా బలగం సినిమా థియేటర్లలో బలంగా మారిందని తెలుస్తుంది.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు.