టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు. నితిన్ గత చిత్రాలు రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలం కావడంతో ఈ సినిమాపై నితిన్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ విషయం పక్కన పెడితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో నితిన్ ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. వక్కంతం వంశీ తదుపరి మరి భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల ఆల్రెడీ లైన్లో ఉన్నారు. మరి, ఈ సినిమా చేస్తూనే, వేణు శ్రీరామ్ సినిమాని కూడా నితిన్ పట్టాలెక్కిస్తారని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారట.
ఉగాది కానుకగా ఈ మూవీపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి.