కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF, కాంతార, విక్రాంత్ రోణా, 777 చార్లీ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టి KFIపై పడేలా చేశాయి.ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్ ని ఎగ్జైట్మెంట్ గా మారుస్తూ ‘కబ్జా’ సినిమా వస్తుంది. వెర్సటైల్ యాక్టర్స్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ సినిమాని చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శివన్న స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పోస్టర్స్, టీజర్ తో అంచనాలని పెంచిన కబ్జా చిత్ర యూనిట్ లేటెస్ట్ గా కబ్జా ట్రైలర్ ని లాంచ్ చేశారు. రిచ్ విజువల్స్, హ్యుజ్ సెటప్స్, స్టెల్లార్ కాస్ట్, ఎలక్ట్రిఫయ్యింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి విషయాలు కబ్జా ట్రైలర్ ని మాస్టర్ పీస్ లా మార్చాయి. అయితే ఇంటర్ కట్స్ ఎక్కువగా ఉండడంతో ఆ ట్రైలర్ ని కాస్త ఎక్కువ సేపే చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ట్రైలర్ లో చూపించిన సుదీప్, ఉపేంద్రల రెండు డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. శ్రేయ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్లు సారీలో ఎలిగాంట్ గా ఉంది. ఈ మధ్య కాలంలో ఇదే తన బెస్ట్ లుక్ అని చెప్పాలి. థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి సర్ప్రైజ్ ని ప్లాన్ చేసిన దర్శకుడు చంద్రు ట్రైలర్ లో ఎక్కడా శివన్న క్యామియోకి సంబంధించిన క్లిప్ ని కూడా ప్లే చెయ్యలేదు. శివన్న కనిపిస్తాడేమో అని కబ్జా ట్రైలర్ చూసిన ఫాన్స్ కి నిరాశ తప్పదు. అయితే ఒక భారి సినిమా కన్నడ నుంచి వస్తుంది, ఇది ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై పెరిగిన అంచనాలు చూస్తే కబ్జా సినిమాకి పాన్ ఇండియా హిట్ అయ్యే సత్తా ఉందనిపిస్తుంది. మరి మార్చ్ 17న ఆ అంచనాలని అందుకోని కబ్జా సినిమా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.