ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 01:25 PM

ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్రంతో విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, మినిమం గ్యాప్ లోనే మరో సినిమాతో మనముందుకు రాబోతున్నాడు.ఈ హీరో నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'మీటర్‌'.మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, క్లాప్‌ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై చెర్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి దర్శకుడు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.కిరణ్ అబ్బవరం కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా ఉంటుంది.


అతుల్య రవి హీరోయిన్. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందించాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు.. కథ-స్క్రీన్ ప్లే విభాగాల్ని కూడా రమేష్ చూసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com