రెండు ఛార్ట్ బస్టర్ల తదుపరి మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ "దసరా" నుండి రాబోతున్న మూడవ పాటపై ఆడియన్స్ లో ఐతే, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చెన్నై కల్చరల్ ఈవెంట్ లో భాగంగా ఈ పాటకు సంబంధించిన మొదటి రెండు లైన్లను నాని లీక్ చెయ్యడమే ఇందుకు కారణం. మరి, ఈ నేపథ్యంలో ఆడియన్స్ ఆతృతకు కాస్తంత కామా పెడుతూ రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు మేకర్స్ ప్రోమోను విడుదల చెయ్యబోతున్నారు. ఫుల్ సాంగ్ మార్చి 8న విడుదల కాబోతుంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈనెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.