మార్చి 7వ తేదీ ఉదయం 10:40 నిమిషాలకు విడుదల కాబోతున్న బెదురులంక 2012 ఫస్ట్ సింగిల్ యొక్క ప్రోమోను మేకర్స్ కాసేపటి క్రితం విడుదల చేసారు. ప్రోమో ను బట్టి ఇదొక రొమాంటిక్ మెలోడీ గా ఉండబోతుందని తెలుస్తుంది. మణిశర్మ స్వరపరిచిన ఈ గీతాన్ని హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు.
క్లాక్స్ డైరెక్షన్లో కార్తికేయ, నేహశెట్టి జంటగా నటించిన ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు.