యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం "CSI సనాతన్". ఆల్రెడీ ఈ సినిమా నుండి ఒక ట్రైలర్ విడుదలై, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకోగా, తాజాగా మేకర్స్ మార్చి 7న యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు సరికొత్త ప్రకటన చేసారు.
మార్చి 10వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాకు శివశంకర్ దేవ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు.