శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హీరో మంచు మనోజ్, భూమా నాగ మౌనికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మి ఫిలింనగర్ లోని తన స్వగృహంలో తమ్ముడు మనోజ్ పెళ్లిని జరిపించింది.
పెళ్లి తదుపరి రోజు మౌనిక సొంతూరు కర్నూల్ కి వెళ్లిన కొత్త జంట తాజాగా ఈ రోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు మనోజ్, మౌనిక తిరుపతిలో హల్చల్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరితో పాటుగా మంచు లక్ష్మి కూడా ఉన్నారు.