గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా "గేమ్ ఆన్". దయానంద్ డైరెక్షన్లో రియల్ టైం సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'రిచో రిచ్' ప్రోమో విడుదలయ్యింది. డబ్బు కోసం, డబ్బు చుట్టూ తిరిగే ఈ పాడు లోకం యొక్క పోకడను వివరిస్తూ అసుర, రికీ ఈ పాటను పాడారు. పూర్తి పాట మార్చి 9న విడుదల కాబోతుంది. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్ల పై రవి కస్తూరి నిర్మిస్తున్నారు.