యంగ్ హీరో శర్వానంద్ ఈ రోజుతో సినీ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకాభిమానులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు తన ఈ బ్యూటిఫుల్ సినీ జర్నీ లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ శర్వానంద్ హార్ట్ ఫెల్ట్ థాంక్యూ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇరవై ఏళ్ళ క్రితం 'శ్రీకారం' చుట్టిన ఈ సినీ 'ప్రస్థానం' మరపురానిదని, తన ఈ 'ఒకే ఒకే జీవితం' సినిమాకే అంకితమని శర్వా నోట్ లో పేర్కొన్నారు. ఈ సినీలోకంలో తన 'గమ్యం' ఎంతో దూరం అని, ప్రేక్షకులను అలరించడం కోసం ప్రతి క్షణం 'రన్ రాజా రన్' లా పరుగులు తీస్తూనే ఉంటానని, కృషి చేస్తూనే ఉంటానని 'శతమానం భవతి' అంటూ ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే ఆశీస్సులతో ఇది తప్పక సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నట్టు శర్వా నోట్ లో పేర్కొన్నారు.