ఆల్విన్ హెన్రీ దర్శకత్వంలో సిజ్లింగ్ నటి మాళవిక మోహనన్ నటించిన 'క్రిస్టీ' సినిమా ఫిబ్రవరి 17, 2023న గ్రాండ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ సినిమాలో కుంబళంగి నైట్స్ ఫేమ్ మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మలయాళ రొమాంటిక్ డ్రామా మార్చి 10వ తేదీ నుండి సోనీ LIV లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో జాయ్ మాథ్యూ, నీనా కురుప్, ముత్తమణి, మంజు సుచియన్, రాజేష్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. రాకీ మౌంటైన్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa