శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుండి ప్రారంభం కానుంది.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో రుహాని శర్మ మహిళా కథానాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa