బీవీ నందినిరెడ్డి దర్శకత్వంలో క్రేజీ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం "ఓహ్! బేబీ". 2019, జూలై 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి థియేటర్లకు రాబోతుంది. మార్చి 8వ తేదీన PVR /ఐనాక్స్ లలో ఓహ్! బేబీ స్క్రీనింగ్ జరగనుంది.
నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, తేజ సజ్జ, సునయన, ఊర్వశి, ప్రతిభ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, అడివిశేష్, నాగ చైతన్య, సుమ కనకాల స్పెషల్ రోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa