పుష్ప సినిమాతో లైం లైట్ లోకొచ్చిన నటుడు జగదీశ్ ప్రతాప్. ఆ సినిమాలో బన్నీ అసిస్టెంట్ గా ఉంటూ, సినిమా కథను ప్రేక్షకులకు చెప్పే వ్యక్తిగా కీలకమైన రోల్ లో నటించి, ప్రేక్షకులను మెప్పించాడు.
జగదీశ్ ప్రతాప్ లీడ్ హీరోగా నటిస్తున్న చిత్రం "సత్తిగాని రెండెకరాలు". అభినవ్ దందా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ రోజు ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అయ్యింది. టైటిల్ కి తగ్గట్టే హీరో సత్తిగాడి రెండు ఎకరాల చుట్టూనే ఈ సినిమా మొత్తం నడుస్తుందని టీజర్ ను బట్టి తెలుస్తుంది. పోతే, మార్చి 17 నుండి ఈ సినిమా ఆహా ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa