కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "దసరా". పాన్ ఇండియా భాషల్లో ఈనెల 30న విడుదల కావడానికి ముస్తాబవుతోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో, నాని ఇతర భాషల ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈమధ్యనే చెన్నై లో నాని దసరా ప్రమోషన్స్ లో పాల్గొనగా, తాజాగా ఈ రోజు ముంబైలో దసరాని నాని ప్రమోట్ చేసారు. ఈ మేరకు జుహు, JVD గ్రౌండ్స్ లో జరిగిన డంక్ ఫస్ట్ ఇండియా ఫర్ హోలీ ఈవెంట్ లో నాని పాల్గొన్నారు. అక్కడి అభిమానులు నానికి ఘనస్వాగతం పలికారు. ఈ ఈవెంట్ లో నాని ఎల్లో కలర్ ఔట్ ఫిట్ లో రేడియంట్ గా కనిపిస్తున్నారు.