కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చెన్నైలో కమల్ హాసన్ మరియు ఇతర నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను మూవీ మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.
తాజా అప్డేట్ ప్రకారం, ఆస్కార్ అవార్డు విన్నర్ సంగీత దర్శకుడు AR రెహమాన్ కంపోస్ చేసిన ఇండియన్ సినిమాలో ఉపయోగించిన కొన్ని ఐకానిక్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌లను మళ్లీ ప్రీక్వెల్ ఇండియన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ AR రెహమాన్‌ని సంప్రదించి తెలియజేసినట్లు అయితే రెహమాన్ వెంటనే ఇందుకు అంగీకరించినట్లు లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.