బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్, డ్రీం గర్ల్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం "తూ ఝూఠీ మై మక్కార్". రణ్ బీర్ - శ్రద్ధ కాంబోలో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే. లవ్ రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను లవ్ ఫిలిమ్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
పోతే, రేపే ఈ మోస్ట్ ఏవైటెడ్ సినిమా థియేటర్లకు రాబోతుంది. మరి, విడుదలై, ఐదు వారాలు దాటుతున్నా షారుఖ్ ఖాన్ 'పఠాన్' బాక్సాఫీస్ వద్ద భీకర కలెక్షన్లను రాబడుతున్న విషయం తెలిసిందే. మరి, పఠాన్ ని ఎదుర్కొని ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉండగలదా ? ...తెలియాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే.