హీరో విశ్వంత్, సునీల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "కథ వెనుక కథ". కృష్ణ చైతన్య డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీజిత ఘోష్, శుభ శ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ప్రేక్షకాభిమానులకు హోళీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. అలానే ఈ సినిమా నుండి 'నిన్ను చూసి చూడంగ' అనే మెలోడీ మార్చి 10వ తేదీన విడుదల కాబోతుందని కూడా పేర్కొన్నారు.
అలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుమ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.