పా రంజిత్ దర్శకత్వంలో స్టార్ హీరో ఆర్య నటించిన 'సర్పత్త పరంబరై' సినిమా 2021లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా తెలుగులో 'సరపట్ట పరంపర' అనే టైటిల్ తో విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సీక్వెల్‌ను ప్రకటించారు. ఆర్య సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అతి త్వరలో ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నాద్ స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ మరియు షో పీపుల్ ఈ సినిమాని నిర్మిస్తుంది.