వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఆంథోనీ మట్టిపల్లి రూపొందించిన చిత్రం "గీతసాక్షిగా". బుల్లితెర నటుడు ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రూపేష్ శెట్టి, భరణి శంకర్ కీలకపాత్రల్లో నటించారు.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా రిపబ్లిక్ డే 2023న విడుదల కావలసి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు మరోసారి మేకర్స్ గీతసాక్షిగా అఫీషియల్ విడుదల తేదీని ఖరారు చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. మార్చి 22న తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది.
చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు కథను కూడా అందించారు.