ఆరు సంవత్సరాల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఇప్పుడు 'లాల్ సలామ్' అనే కొత్త సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 2022లో ప్రకటించబడిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ నటిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, లాల్ సలామ్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ రజనీకాంత్ సోదరిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.