మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుండి ఇటీవల విడుదలైన సరికొత్త చిత్రం "క్రిస్టోఫర్". బి. ఉన్నికృష్ణన్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఆయనే నిర్మించారు. వినయ్ రాయ్, ఐశ్వర్య లక్ష్మి, స్నేహ, అమలా పాల్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించారు.
రీసెంట్గా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. మార్చి 9 నుండి ప్రైమ్ వీడియోలో, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషలలో క్రిస్టోఫర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుందని అఫీషియల్ పోస్టర్ విడుదలయ్యింది.