ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ సేన్ "ధమ్కీ" ఇచ్చేది ఆ రోజేనా ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 06:57 PM

'పాగల్' సినిమా తదుపరి హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "దాస్ కా ధమ్కీ". ఈ సినిమాకు విశ్వక్ డైరెక్టర్ గా, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం.


ఐతే, ఈ చిత్రం ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం ప్రమోషన్స్ ను ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతుందని మేకర్స్ నుండైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి, విశ్వక్ సేన్ ధమ్కీ థియేటర్లకు వచ్చేది మార్చి 22న అని తాజాగా అందుతున్న సమాచారం. అతి త్వరలోనే, ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com