ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'క్రిస్టోఫర్‌'

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 08:33 PM

బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'క్రిస్టోఫర్‌' సినిమా ఫిబ్రవరి 9, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా OTT ప్లాట్‌ఫారమ్, ఈ చిత్రం మార్చి 9, 2023న ప్రదర్శించబడుతుంది అని అధికారకంగా ప్రకటించింది. మలయాళంతో పాటు ఈ బిగ్గీ తెలుగు, తమిళం మరియు హిందీలో కూడా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఉదయ్‌కృష్ణ రాసిన ఈ మలయాళ బిగ్గీ లో విలన్‌గా వినయ్‌ రాయ్‌ నటించారు. ఐశ్వర్య లక్ష్మి, అమలా పాల్, స్నేహ, షైన్ టామ్ చాకో మరియు జిను జోసెఫ్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్‌డి ఇల్యూమినేషన్స్‌పై ఉన్నికృష్ణన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com