పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ప్రేక్షకులను ముందుగా పలకరించబోయే సినిమా "ఆదిపురుష్". శ్రీమద్రామాయణం ఆధారంగా, దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ విజువల్ వండర్ ప్రస్తుతం VFX పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ రఘురాముడిగా, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా నటిస్తున్నారు.
ఐతే, ఈ సంక్రాంతికి విడుదల కావలసిన ఆదిపురుష్ పలు కారణాల వల్ల జూన్ 16కి వాయిదా పడిన విషయం తెలిసిందే. నేటితో ఆదిపురుష్ థియేటర్లకు వచ్చేందుకు సరిగ్గా 100రోజుల వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్లకు రాఘవరాముని ఆగమనం.. మరో వందరోజుల్లో అంటూ... డార్లింగ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.