అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్' కు ఇండియన్ అడాప్షన్ గా రూపొందిన వెబ్ సిరీస్ "రానా నాయుడు". ఇందులో విక్టరీ వెంకటేష్, విలక్షణ నటుడు రానా ప్రధానపాత్రల్లో నటించారు. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ సందర్భంగా రేపు అంటే మార్చి 8వ తేదీన రానా ఒక బిగ్ సర్ప్రైజ్ ను ఇవ్వబోతున్నారు. మరి, ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది తెలుసుకోవాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.