ఇటీవల 'మైఖేల్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన హీరో వరుణ్ సందేశ్ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించేందుకు రెడీ అయ్యారు. BM సినిమాస్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రూపొందుతున్న చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ లుక్ రేపు విడుదల కాబోతుంది. హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, రథన్ సంగీతం అందిస్తున్నారు. శేషు మారాంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.