హీరో విశ్వంత్ నటిస్తున్న కొత్త చిత్రం "కథ వెనుక కథ". శుభశ్రీ, శ్రీజిత గౌష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి 'ముచ్చటైతది ..మామ మస్తు ముచ్చటైతది' అనే స్పెషల్ సాంగ్ విడుదలయింది. RP పట్నాయక్ స్వరపరిచిన ఈ గీతాన్ని మోహన భోగరాజు ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. పోతే, ఈ సినిమాను దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు.