టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలోగా సూపర్ హిట్ కొట్టి చాలా కాలమవుతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన నాగార్జున గత చిత్రం ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్ నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, సూపర్ హిట్ రైటర్, ధమాకా చిత్రంతో ఇటీవల వార్తల్లో నిలిచిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో నాగార్జున ఒక సినిమాను చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో ఇప్పటివరకు రైటర్ గా ఉన్న ప్రసన్న కుమార్ డైరెక్టర్ గా మారబోతున్నారట. మరి, ఉగాదికి ఈ మూవీ నుండి నాగ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చెయ్యబోతున్నట్టుగా లేటెస్ట్ టాక్ నడుస్తుంది.